ఏపి నుండి రాజ్యసభకు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు..!

ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళి అయిన నాలుగు రాజ్యసభ స్థానాలనలో మూడింటిని సునాయాసంగాగెలుచుకునే బలం టిడిపికి ఉంది. అయితే మిత్ర ధర్మంలో భాగంగా ఓక స్థానాన్ని భాజపాకు కేటాయించారు. భాజపా నుండి నిర్మలా సీతారామన్ లేక వెంకయ్యనాయుడు పోటి చేస్తారని భావించారు. అయితే వెంకయ్య రాజ్యసభకు రాజస్థాన్ నుండి, సీతారామన్ కర్నాటక నుండి పోటి చేస్తుండడంతో ఏపి నుండి భాజపా తరపున ఎవరు పోటి చేస్తారు అని ఉత్కంట నెలకొంది. ఇప్పుడు తాజాగా భాజపా తరపున కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు పేరు వినిపిస్తుంది. సురేష్ ప్రభును ఏపి నుండి బరిలోకి దింపడానికి కారణాలు లేకపోలేదు, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని ఎప్పట్నుంచో డిమాండ్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కేంద్ర రైల్వే మంత్రిని బరిలోకి దింపడం ద్వారా విశాఖకు రైల్వే జోన్ ప్రకటించే అవకాశం ఉందని, సురేష్ ప్రభును చూపించి ఏపిలో బలోపేతం అయ్యేందుకు బిజెపి పావులు కదుపుతున్నట్లు కనిపిస్తుంది.

Leave a Reply