గ్రూప్ – 2 భర్తీలో మరో 460 పోస్టులు

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. గతంలో వాయిదా వేసిన గ్రూప్ – 2 పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఇంతకుముందు ప్రకటించిన 439 పోస్టులకు అదనంగా మరో 460 పోస్టులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించిన 439 పోస్టులతో సహా 1000 పోస్టులకు నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ అధికారులు ఖాళీల వివరాలను సేకరించే పనిలో పడ్డది. అన్ని వివరాలను సేకరించిన తర్వాత రెవిన్యూ శాఖలో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Leave a Reply