పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి రంగం సిద్దం అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచినట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీకి వయసు పై బడటం, ఆమె ఇంతకుముందులా చురుగ్గా పనిచేయలేకపోవటం లాంటి కారణాలతో అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ కట్టబెట్టనున్నారు. రాహుల్ గాంధీతో పాటు మొత్తం కార్యవర్గాన్నే మారుస్తారని సమాచారం. ఇప్పుడున్న్న అనేక మంది సీనియర్ల స్థానంలో యువకులకు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి. కాని రాహుల్ గాంధీ పదవిని తీసుకుంటారా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు పార్టీ అధ్యక్ష పదవిని చేపడతారని వార్తలు వచ్చినా రాహుల్ మాత్రం నిరాకరించారు. ఇప్పుడు కూడా ఆయన అలాగే చేస్తే మాత్రం సోనియాగాంధీ అధ్యక్షురాలుగా కొనసాగే అవకాశం ఉంది.

Leave a Reply