మరో 20 ఏళ్ళు కెసిఆరే సిఎం – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న తెలంగాణ సాగునీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు మీడియా సంస్థలు ఆయనను కెసిఆర్ వారసుడు ఎవరని ప్రశ్నిస్తూ వివాదం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నా, ఆయన మాత్రం ఎంతో పరినీతితో సమాధానం ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ మరో 20 ఏళ్ళు ఆ పదవిలో ఉంటారు అటువంటప్పుడు వారసుడు ఎవరు అన్న ప్రశ్నే అనవసరం అని హరీష్ రావు అన్నారు. అసలు పార్టీలో నెంబర్ గేమ్ అనేదే లేదని అంతా కెసిఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. అలాగే తన మనుషులకు పదవులు రావడం లేదు అని వస్తున్న వార్తలలో నిజం లేదని హరీష్ రావు తెలిపారు. ఉద్యమ సమయంలో కన్నా ఇప్పుడు తాను కుటుంబాన్ని మరింత మిస్ అవుతున్నట్లు తెలిపాడు. బంగారు తెలంగాణ కోసం మరింతగా శ్రమిస్తానని హరీష్ రావు పేర్కొన్నాడు.

Leave a Reply