తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట..

తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టులో ఊరట లభించింది. ప్రాజెక్టుల భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 123ను రద్దుచేస్తూ హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హై కోర్టు డివిజన్ బెంచ్ నిలిపి వేసింది. హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, డివిజన్ బెంచ్ ను ఆశ్రయించి తన వాదనలు వినిపించింది. భూ నిర్వాసితులకు, రైతు కూలీల రక్షణకు తీసుకునే చర్యలను కోర్టు ముందు ఉంచింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని, ఉపాది కోల్పోతున్న వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. జీవో ప్రకారం ముంపు బాధితుల్లోని ఉపాధి కార్మికులకు ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని తమ ముందు ఉంచాలని అప్పటి వరకు సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Leave a Reply