ఆప్ ను అడ్డు పెట్టుకొని తప్పించుకున్న బీజేపీ..

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచందర్ రావు ప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బిల్లు మరోసారి చర్చకు రాకుండానే వాయిదా పడింది. అందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ భగవంత్ మాన్ సింగ్ చేసిన పిల్ల చేష్ట కారణం అయ్యింది. భగవంత్ తన సెల్ ఫోన్ లో పార్లమెంట్ పరిసరాలను వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఉభయ సభల్లో డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా మాన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.అధికార బీజేపీకి చెందిన సభ్యులైతే ఏకంగా పోడియం వద్ద బైటాయించారు. దాంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు. కాగా ప్రత్యేక హోదా బిల్లు పైన చర్చ కోసం ఎంతగానో ఎదురు చుసిన ఆంధ్రులకు మరోసారి నిరాశే ఎదురయింది.

Leave a Reply