బాబ్రీ మసీదు ఇతివృత్తంతో వస్తున్న ‘కబీర్’

బాహుబలి లాంటి చారిత్రాత్మక కథనాలు, భాజరంగి భాయిజాన్ వంటి విభిన్న కథాంశాలతో ఎప్పుడు వైవిధ్యంగా కథలను రచించే వ్యక్తి విజయేంద్ర ప్రసాద్. భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన సంఘటనగా పేరుపొందిన బాబ్రీమసీదు విధ్వంసాన్ని కథాంశంగా తీర్చిదిద్దే పనిలో విజయేంద్రప్రసాద్ నిమగ్నమయ్యారని త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెత్తనున్నట్లు సమాచారం. అయితే ఈ కథకి బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ చిత్రానికి నిర్మాత సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ అంగీకరించారు. ఒకవేళ అంతా అనుకున్నట్లుగా జరిగితే విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యత కూడా తీసుకుంటాడని ఫిలిం ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది.

Leave a Reply