పాకిస్థాన్ కు మరో షాక్ ఇచ్చిన మోడీ..

భారత ప్రధాని ఆగష్టు 15 న జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పటి నుండి ఆయన బలూచిస్తాన్ పై ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నారు. మరో వైపు బలూచ్ నేతలు కూడా మోడీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు బలూచ్ ప్రజలకు మోడీ మరో కానుక అందించారు. అక్కడి వారికి ఎటువంటి సమాచారం చేరకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ, టీవీ, రేడియో వంటి వాటిని నిషేధించిన పాక్ ప్రభుత్వానికి మోడీ గట్టి షాక్ ఇచ్చారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు ఇక పై బలూచిస్తాన్ భాష ఐనా బలుచీలో కూడా జరగనున్నాయి. ఈ మేరకు ఆకాశ వాణికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

Leave a Reply