అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం భేటీ

తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుపై గత కొన్ని నెలలుగా తీవ్రంగా చేస్తున్న కసరత్తు చివరిదశకు చేరింది.ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి అధికార,ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తం ఏడు పార్టీలకు సంబంధించిన 14 మంది ప్రతినిధులు వారితో పాటు ప్రభుత్వ పెద్దలు అలాగే ప్రభుత్వం తరపున కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు.జిల్లాల విభజనపై సబ్ కమిటీ నివేదికలో పొందుపరిచిన ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై ఈ అఖిలపక్ష సమావేశంలో వివరంగా చర్చించనున్నారు.ఈ సమావేశంలో పూర్తిస్థాయి సమాచారం, మ్యాపులతో కూడిన నూతన జిల్లాల గురించి ప్రభుత్వం ఆయా పార్టీల నేతలకు క్షుణ్ణంగా వివరించనుంది ప్రభుత్వం.అన్ని పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలను సబ్ కమిటీ స్వీకరించి పరిగణనలోకి తీసుకోనుంది.అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. అఖిలపక్ష సమావేశంలో మిగతా పార్టీల ప్రతినిధులు తెలిపిన అభిప్రాయాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.

  • టీఆర్‌ఎస్ నుంచి కే కేశవరావు, నిరంజన్‌రెడ్డి,
  • టీడీపీ నుంచిఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి,
  • కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క,
  • బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి,
  • సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి,
  • సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి,
  • ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ

ఈ అఖిల పక్ష సమావేశంలో పాల్గొననున్నారు.

Leave a Reply