గూగుల్ పై మండిపడ్డ హై కోర్టు..

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పై అలహాబాద్ హై కోర్ట్ తీవ్రంగా మండిపడ్డది. గూగుల్ కంపెనీపై, ఆ కంపెనీ ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారి చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే గూగుల్ లో టాప్ 10 క్రిమినల్స్ అని టైప్ చేస్తే పలువురు క్రిమినల్స్ తో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో దర్శనం ఇస్తుంది. దీనిపై సుశీల్ కుమార్ మిశ్రా అనే న్యాయవాది గూగుల్ లో క్రిమినల్స్ ఫోటోలతో పాటుగా ఉన్న మోదీ ఫోటో తీసివేయాల్సిందిగా గూగుల్ కు లేఖ రాశారు. దీనికి గూగుల్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయమై మిశ్రా పోలీసులకు కూడా పిర్యాదు చేసి, అలహాబాద్ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారణ చేసిన కోర్ట్ క్రిమినల్స్ ఫోటోలతో పాటు ప్రధాని మోదీ ఫోటో రావడమేంటని మందిపడ్డది. వెంటనే గూగుల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

Leave a Reply