భారత్ కు అండగా నిలుస్తామన్న అమెరికా..

భారత్ కు మరోసారి సుద్దులు చెప్పే పని పెట్టుకుంది అగ్రదేశం అమెరికా. భారత్ లో అసహనం పెరిగి పోతుందంటూ అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దాడులకు పాల్పడే వారిని చట్ట ప్రకారం శిక్షించాలని, పౌరులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా భారత ప్రభుత్వానికి సూచించింది.బీఫ్ ను తరలిస్తున్నారని,గొడ్డు మాంసాన్ని తింటున్నారని ముస్లింలపై దాడులు చేస్తున్నారని, హింస పెరిగి పోతుందంటూ వస్తున్న వార్తలపై తాము ఆందోళన చెందుతున్నట్లు అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ప్రపంచం అంతా ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కొంటుందని, ఈ నేపథ్యంలో భారత్ కు తాము అండగా ఉంటామని కిర్బీ వెల్లడించారు.

కిర్బీ చేసిన వ్యాఖ్యలపై పలువురు భారతీయులు మండి పడుతున్నారు. అమెరికా ఆందోళన చెందుతున్నట్లు భారత్ లో అసహనం లేదని, అనవసరంగా భారత్ పై దుష్ప్రచారం చేయొద్దని సూచించారు. ముందు అమెరికాలో అంతర్గతంగా నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఆపాలని తర్వాత వేరే దేశాల గురించి ఆలోచించాలని విమర్శించారు.

Leave a Reply