డోనాల్డ్ ట్రంప్ పై ఒబామా సంచలన వ్యాఖ్యలు…

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సొంత పార్టీ అయిన డెమోక్రాటిక్ పార్టీ జాతీయ సదస్సులో ప్రసంగించారు. ఆయన 12 సంవత్సరాల క్రితం ఇదే వేదికపై డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థీగా ప్రసంగించారు. ఇప్పుడు రెండు సార్లు అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిగా మాట్లాడుతూ నవంబర్ లో జరిగే ఎన్నికల్లో పోటి చేస్తున్న ప్రస్తుత డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థీ హిల్లరీ క్లింటన్ కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇంకా ఒబామా మాట్లాడుతూ రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పని చేశానని, అమెరికా భవిష్యత్తు పట్ల తాను ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, గొప్ప దేశం అమెరికా అని, అటువంటి దేశానికి డోనాల్డ్ ట్రంప్ పై ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ అధ్యక్షుడయితే తన సంకుచిత భావ జాలంతో అమెరికాను అమ్మేస్తాడు అని విమర్శించారు. హిల్లరీ మన పిల్లల భవిష్యత్తును కాపాడగలదని, ఆమె ఐఎస్ఐఎస్ పై పోరాడటానికి సిద్దంగా ఉన్నదని వెల్లడించారు.

Leave a Reply