అటువంటి పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదు..!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైయేసార్సీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్నారు అని విమర్శించారు. అసాధ్యమనుకున్న పట్టిసీమ ప్రాజెక్టును తాను చేసి చూపించానని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడో 177 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు నదులను కలిపానని, ఆ అదృష్టం తనకు దక్కిందని చంద్రబాబు వివరించారు. అది కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు మొదలెట్టి ఒక సంవత్సరంలో పూర్తి చేశామని తెలిపారు. భూ సేకరణ కోసం 700 కోట్లు ఖర్చు చేశామని అందుకు సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావును అభినందిస్తున్నామని అన్నారు. ఆంద్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష పార్టీ పనికిమాలిన పార్టీ అని, అటువంటి పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు.

Leave a Reply