ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చాలా చిక్కుల్లో చిక్కుకుoటున్నారు. ఉన్నట్టుండి ఏపీకి చెందిన కీలక విషయాల్లో అటు కేంద్రం, ఇటు తెలంగాణ దాడులు చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఒక్క సారిగా ఆంధ్ర రాజకీయ రంగం మరోసారి వేడెక్కాయి. అటు కేంద్ర ప్రభుత్వo మరియు తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆందోళన బాట పట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి.జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే చంద్రబాబును పద్మవ్యూహంలోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది.

ఏపీకి అత్యవసరంగా కావాల్సిన నిధులు, నీళ్లు. నిధులకు కేంద్రం మోకాలడ్డుతుంది. నీళ్లను తెలంగాణ దెబ్బతీస్తోంది. అటు కేంద్రం, ఇటు తెలంగాణ ఏక కాలంలో సమస్యలు తెచ్చిపెట్టే సరికి చంద్రబాబుకు ఏమి పాలుపోవడం లేదు. అయితే ఇదంతా ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధమే అన్నవాళ్ళు లేకపోలేరు చంద్రబాబుకు సొంత పార్టీలోనూ ప్రతికూల పరిస్థితులు నెలకొనడం ఆయనకు మరింత ప్రమాదకర పరిస్థితులను తెచ్చిపెట్టేవిధంగా తయారైంది.

ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని అటు కేంద్రం స్పష్టం చేయడంతోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.మూలిగే నక్క మీద తాటి పండులా పోలవరంకు కూడా నిధులిచ్చేది లేదని కేంద్రం స్ప్రష్టం చేయడంతో బాబు పరిస్థితి అగమ్యగోచరంగా తాయారయ్యిది. ఇప్పుడు తమ మిత్ర పక్షమైన బీజేపీతో ఎలా వ్యవహరించాలి అన్న డైలామాలో పడ్డాడు.ఈ ఆలోచనల నుంచి తేరుకోకముందే పిడుగులాంటి వార్త ఆయనకు చేరింది. అదే అత్యంత కీలకమైన రెవెన్యూలోటు. విభజన సంధర్భంగా ఇచ్చిన  హామీలలో ఇది ఒకటి. ఇప్పుడు దీనిపని తీర్చలేమని కేంద్రం తేల్చేసింది. రెవెన్యూలోటును తీర్చడం తప్పనిసరి కాదు అని కుండ బద్దలుకొట్టింది. తమ దగ్గర ఉన్న నిధుల లభ్యతను బట్టి ఇస్తే ఇస్తాం లేదంటే లేదు అని లోక్ సభ సాక్షిగా పేర్కొంది.

దీంతో ఇక ఏపీకి కేంద్రంపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పకనే చెప్పింది. మరో వైపు నీళ్ల విషయంలోనూ తెలంగాణ పేచికి సిద్దం అవుతుంది. ఎట్టి పరిస్థితులలోనుతెలంగాణలో పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి తీరుతాం అని కేసీఆర్ ఖచ్చితంగా చెప్పాడు అంతే కాదు దానికి సంబంధిచిన పనులకు శంకుస్థాపనలు చేస్తూ పనులనువేగంగా ముందుకు తీసుకుపోయే పనిలో పడ్డారు. కెసిఆర్ ఇంకో అడుగు ముందుకేసి వీటిని ఎవరూ ఆపలేరు, ఒక వేళ ఆపాలని చూస్తే మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం అని తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబుకూడా ఈ విషయాలలో పొరపాటు చేసినట్లే ఉన్నారు.ఎందుకంటే ముందునుండి కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్ పై కఠినంగానే ఉంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాదాని కొద్దిగా కూడా ఉదారం చూపలేదు.అప్పుడే చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించి ఉంటే కేంద్రం ఇంత ధైర్యంగా ప్రత్యేక హోదా ఇవ్వము అని ప్రకటించి ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వానికి వోటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోవడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించలేని పరిస్థితి బాబుకు తలెత్తింది. వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబును నిలదీస్తూ ఉండడంతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.

ఇప్పటికైనా చంద్ర బాబు మిగిలిన అన్ని పక్షాలను కలుపుకొని పోతే మంచిది. ఆంధ్ర ప్రదేశ్ తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఇది వరకే ప్రకటించాడు కాబట్టి ఆయన వ్యక్తిగత భేషజాలకు పోకుండా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణతో చర్చిస్తే మంచిది. అలాగే కేంద్రంతో ప్రత్యేక హోదాపై కఠినంగా వ్యవహరిస్తే ప్రజలు సంతోషిస్తారు.

Leave a Reply