ఎందుకు…?

ఆంధ్రప్రదేశ్ లో రైతుల దగ్గర భూములను రాజకీయ పార్టీలకు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చిన జీవో వివాదాస్పదమవుతుంది.  శాసన సభలో 50 పైగా సభ్యులున్న పార్టీకి 4 ఎకారాలు, 25-50 శాతం సభ్యులున్న పార్టీకి అర ఎకరం, కనీసం ఒక సభ్యుడు ఉన్న పార్టీకి 1000 గజాలు ఇస్తూ జీవో తీసుకు వచ్చింది.  ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు ఈ జీవోపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైఎస్సాసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. రైతుల భూములను చంద్రబాబు స్వాహా చేస్తున్నారని, రైతుల భూములను రాజకీయ పార్టీలకు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. ప్రభుత్వ జీవో అసలు ఉద్దేశం పార్టీల పేరు చెప్పి ఖరీదైన భూములను కాజేయడమేనని అని ఆరోపించారు.చంద్రబాబు కనీసం నాలుగు ఎకరాలు భూమి కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు.

Leave a Reply