దెబ్బ మీద దెబ్బ…

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి షాక్ ఇచ్చారు. గతంలో ఆమెను కీలకమైన మానవ వనరుల శాఖ నుండి తప్పించి అంతగా ప్రాధాన్యం లేని జౌళి శాఖను అప్పగించారు. ఇప్పుడు తాజాగా ఆమెను పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుండి తప్పించారు. అందుకు ఆమె వ్యవహార శైలే కారణం అని చెప్పవచ్చు. హెచ్ సీయూ విద్యార్థి రేహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో, ఢిల్లీ యూనివర్సిటీ నాయకుడు కన్హయ్య కుమార్ అరెస్ట్ ఘటనలో స్మృతి ఇరానీ వివాదాల్లో ఇరుకున్నారు. అందుకే ఆమెను మానవ వనరుల శాఖను తప్పించారు. ఇప్పుడు మళ్ళి పార్లమెంటరీ కమిటీ నుండి ఉద్వాసన పలికి మరోసారి ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించారు.

Leave a Reply