మరో ముగ్గురు ఎమెల్యేలు క్యూలో..!

తెలంగాణ రాష్ట్రంలో వలసలు ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు. కాంగ్రెస్ నుండి ఈ రోజు నలుగురు కీలక నేతలైన నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమెల్యే భాస్కర్ రావు, మాజీమంత్రి వినోద్, మాజీ ఎంపి వివేక్ లు తెరాసలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు ఎమెల్యేలు కారేక్కేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. వారిలో మాజీ మంత్రి గీతా రెడ్డి, పరిగి ఎమెల్యే రామ్మోహన్, ఆలంపూర్ ఎమెల్యే సంపత్ పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రామ్మోహన్, సంపత్ కేటిఆర్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. మరో వైపు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వీరు ఇప్పటివరకు స్పందించక పోవటం గమనార్హం.

Leave a Reply