తెలంగాణలో ప్రాజెక్టులకు చంద్రబాబు అనుమతి కావాలా?

తెలంగాణలో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్ట్లపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు అక్రమం అని, అవి విభజన చట్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు అని ఆరోపించారు. ఆ ప్రాజెక్టులపై కోర్ట్ లో కేసు వేస్తామని, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయితే గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు నోరెత్తని చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణ న్యాయబద్ధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాద్ధాంతం చేయడం ఆయనకు తెలంగాణపై ఉన్న అక్కసును తెలియజేస్తుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి విషయంలో తెలంగాణ దోపిడికి గురి అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ అప్పుడు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సరిచేసే పనిలో ఉన్నారు. తెలంగాణ వాటాగా ఉన్న 1500 టిఎంసిల నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ చివరి బొట్టు వరకు ఉపయోగించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. దానిలో భాగంగా పాలమూరు ఎత్తిపోతల పథకం, మేడిగడ్డ ప్రాజెక్టు వంటి ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పూర్తయితే తెలంగాణ సస్యశామలం అవుతుంది. తెలంగాణ అభివృద్ధి చెందడం సహించలేక చంద్రబాబు ఇలా చేస్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. తెలంగాణలో ఉన్న తన పార్టీ కార్యకర్తలతో ప్రాజెక్టులపై వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాడు. ఆ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించకపోవడంతో ఇప్పుడు తన మార్కు రాజకీయంగా కేంద్రాన్ని, కోర్ట్ ను ఉపయోగించి తెలంగాణకు వెన్నుపోటు పొడవడానికి సిద్దం అయ్యాడు. చంద్ర బాబు ఎంత గింజుకున్న కెసిఆర్ తెలంగాణలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు ఇవ్వడానికి సిద్దం అయినట్లు ఇప్పటికే ప్రకటించేసారు.

Leave a Reply