కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని ఆయన లేఖలో కోరారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని, పోరాడుతున్నారు అని అందువల్ల ఆయనకు ప్రాణ హాని ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారని, అందుకు ప్రభుత్వం నుండి సరైన స్పందన రాలేదని, దాంతో రేవంత్ రెడ్డి తనకు భద్రత పెంచాలని హై కోర్ట్ లో పిటిషన్ వేశాడని చంద్రబాబు లేఖలో తెలిపారు. హై కోర్ట్ రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసిందని, అందుకు నాలుగు వారాలు సమయం ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించేలా చేసేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. అలాగే రేవంత్ రెడ్డికి 4+4, ఎస్కార్ట్ సెక్యూరిటీ ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

Leave a Reply