చంద్రబాబు ప్రధాని అయితే పవన్ ముఖ్యమంత్రి అవుతాడా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఇటీవల తెలుగు దేశం పార్టీ ఎంపి జేసి దివాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంతమేర అటు ఆంధ్ర ప్రజలను , పార్టీ కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఎప్పటిలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దివాకర్ రెడ్డి ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ని పొగడటమో లేదా పరోక్షంగా విమర్శించడమో అర్ధం కావట్లేదు. ఎందుకంటే ఎపి సిఎం చంద్రబాబు ఇప్పటికే రెండు సార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆ సమయంలో థర్డ్ ఫ్రంట్ కు అధ్యక్షత వహించి ప్రధాని అయ్యే అవకాశం కూడా పొందారని ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి చేసే పనుల్లో నిమగ్నమయ్యారని ఆయన అన్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ని , హైదరాబాద్ ని తానే అభివృద్ధి చేసానని చెప్పుకునే బాబు కి ఇది కాస్త ఇబ్బందికర వ్యాఖ్య ఎందుకంటే జేసి దివాకర్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో అర్ధం చేసుకోవడం ఆ పార్టీ కార్యకర్తలకే కష్టం.. అయితే ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మంచి పట్టు కోసం ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చంద్రబాబు ప్రధాని అయితే పవన్ కళ్యాణ్ తప్పకుండ ముఖ్యమంత్రి అవుతారని ఆయన పార్టీ జనసేన కార్యకర్తలు బాహాటంగానే వారి ఆలోచనని వ్యక్తపరిచారు.

Leave a Reply