90 సెకన్లు.. 15 లక్షలు.. 4 గురు వ్యక్తులు.. 1 బ్యాంక్..

నలుగురు వ్యక్తులు కలిసి చేసిన బ్యాంక్ దొంగతనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం 200 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఎంతో చాకచక్యంగా బ్యాంక్ ను దోచుకెళ్ళారు. ఈ సంఘటన పంజాబ్ లోని లుధియానాలో జరిగింది. లుధియానాలోని కొచ్చార్ పోలీస్ స్టేషన్ కు కేవలం 200 మీటర్ల దూరంలో జవహర్ నగర్ లో ఉన్న భద్రత లేని పంజాబ్ నేషనల్ బ్యాంకును దుండగులు దోచుకెళ్ళారు. తుపాకీలతో వచ్చిన దుండగులు గాల్లోకి కాల్పులు జరుపుతూ కస్టమర్లను కొట్టారు. ఒకరు క్యాషియర్ తలపై, మరొకరు మేనేజర్ తలపై తుపాకీలు పెట్టి డబ్బు డిమాండ్ చేశారు. దాంతో క్యాషియర్ 15 లక్షల రూపాయలను వారికి ఇచ్చారు. అంతలో బ్యాంకులో ఉన్న మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చే లోగానే దొంగలు అక్కడి నుండి జారుకున్నారు. ఇదంతా జరగడానికి కేవలం ఒకటిన్నర నిమిషాలు మాత్రమే పట్టింది. అయితే బ్యాంక్ లో సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోలేదు అన్న దాని పై పోలీసులు విచారణ చేస్తున్నారు, అలాగే బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా దొంగలకు సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply