ఈ పది రోజులు బ్యాంకులు పనిచేయవు..!

బ్యాంకులకు సెలవులు అంటేనే ప్రతి సామాన్యుడికి ఏదో తెలియని ఆందోళన మొదలవ్తుంది. ఏదైనా పండగ కారణంగా వరుస సెలవులు వస్తే ఇక చేయాల్సిన పనులు రెండు మూడు రోజులు వాయిదా వేయక తప్పని పరిస్థితులు లేకపోలేదు. ఆన్లైన్ , మొబైల్ బ్యాంకింగ్ ఎంత విస్తరించినా ఎటిఎం సేవలు ఎంత మెరుగుపరిచినా బ్యాంకుల సెలవులు అంటే చాలా పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎప్పుడైనా ఏదైనా కారణంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసారు అంటే ఇంకా అంతే సంగతులు. అయితే ఈ నెలలో ఈ సందర్భం రాబోతుంది.ఎందుకంటే ఈనెలలో పదిరోజులకు పైగా బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి.

జూలై 06 – రంజాన్

జూలై  09- రెండో శనివారం

జూలై 10- ఆదివారం

జూలై 12- SBI- అనుబంధ బ్యాంకుల సమ్మె

జూలై 13- బ్యాంకు ఉద్యోగుల సమ్మె

జూలై 17 – ఆదివారం

జూలై 23 – నాలుగో శనివారం

జులై 24 – ఆదివారం

జులై 29 – ప్రభుత్వరంగ విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్ల సమ్మె

జులై 31 – ఆదివారం

ఈ రోజుల్లో బ్యాంకులో చలానా,డిపాజిట్, లోన్లు సంబంధిత కార్యకలాపాలు జరగవు. ఏటీఎం,మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ కు ఈ ప్రభావం ఉండకపోవచ్చు.

  • సమ్మె జరగపోతే బ్యాంకులు సేవలు యధావిధిగా జరుగుతాయి. 

 

Leave a Reply