కేసీఆర్ పై నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యలు…

మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్లన్న సాగర్ రైతులపై పోలిసుల లాఠీఛార్జి అమానుషం అని, దానిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని, రైతుల తరపున తాము పోరాడతామని వ్యాఖ్యానించారు. తనలో ఆంధ్ర రక్తం ప్రవహిస్తుందని ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. తనలో తెలంగాణ రక్తం ప్రవహిస్తుందని, తనలో వంద శాతం తెలంగాణ జీన్స్ ప్రవహిస్తునాయని తాను చెప్పగలనని, ముఖ్యమంత్రి కేసీఆర్ లో వంద శాతం ఆంద్ర జీన్స్ ఉన్నాయని నాగం ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులను ప్రజల కోసం నిర్మించాలని, కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తే చూస్తూ ఊరుకోమని నాగం తెలిపారు.

Leave a Reply