నాయుళ్ళిద్దరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ ని ముంచేస్తున్నారు

వెంకయ్యనాయుడు ఈ పేరు బారతదేశ రాజకీయాల్లో తెలియని వాళ్ళు వుండరు. చంద్రబాబు నాయుడు ఈయనకు హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు వచ్చేలా దేశం మొత్తం ప్రచారం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు నాయుడులు అవశేష ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తామని తీరా అవసరం తిరాక ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళలో మొదటి వరుసలో నిలబడతారు. చంద్రబాబు NDA ప్రభుత్వంలో భాగస్వామిగా రెండు మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు కానీ స్పెషల్ స్టేటస్ విషయంలో మాత్రం మోడీ గారిని ఒప్పించడo లో చంద్రబాబు ఫెయిల్ అయినారని ఘంటా పథంగా చెప్పవచ్చు.చంద్రబాబు పక్క ప్రోఫెషనల్ రాజకీయ నాయకుడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ మోడీ నీ చూసి ఎందుకు బయపడుతున్నాడు అని సొంత పార్టీ మంత్రులు మొదలు సామాన్య కార్యకర్తలకు అర్థం కానీ కోట్ల ప్రశ్న నిజంగా చంద్రబాబు నాయుడు గారి సీక్రెట్ వ్యవహారం ఏమైనా మోడీ దగ్గర వున్నదా అని అనుమానం రాక మానదు అందువలనే తను ధైర్యం చేయలేక పోతున్నడనీ అందువలెనే తన ఆవేదన ఎవరు అర్థం చేసుకోలేక పోతున్నారని తనలో తను కుమిలి పోతున్నడని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆనాడు నిండుసభలో ఏపీకి పదేళ్లు హోదా కావాలన్న మాటను వెంకయ్యనాయుడు మరిచారా ఆంధ్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా మాట్లాడి,అధికారంలోకి వచ్చాక హోదా గురించి బిల్లులో పెట్టలేదంటూ మాట మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు? విబజనకి సహకరించారు కానీ ఆంధ్రప్రదేశ్ కి అదనంగా ఇప్పటివరకు ఏం ఇచ్చారు.నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీలో మన గొంతు వినిపించక పోతే మనకు పోలవరం కూడా దక్కకుండా పోతదని ఆ విషయం కూడా మరువ కూడదని రైతునాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి స్పెషల్ స్టేటస్ సంగతేమో గానీ నాయుళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ముంచుతున్నారని అంటూ ఆంధ్ర నుండి ఢిల్లీ దాక పొలిటికల్ సర్కిల్లో కామెంట్లు వినబడుతున్నాయి.

Leave a Reply