అందుకే ఆలస్యంగా స్పందించారు..

దేశంలో ఇటివల దళితులపై జగరుగుతున్న దాడులపై తెలంగాణ పర్యటనలో మోడీ స్పందించిన విషయం తెలిసిందే. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత రెండు సంవత్సరాలుగా దళితులపై దాడులు జరుగుతున్నా, ప్రధాని మాత్రం చాల ఆలస్యంగా స్పందించారని మాయావతి ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా మోడీ కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మోడీ మేల్కొని దళిత ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఒక్క దళిత ఓటు కూడా పడదని ఆమె తెలిపారు.

Leave a Reply