దౌత్య మార్గాల్లో ప్రయత్నించాలని నిర్ణయం..

కోహినూర్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం. ఒకప్పుడు భారత దేశం సొత్తు. దానిని బ్రిటిష్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. 108 క్యారెట్ల కోహినూర్ ఇప్పుడు బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంది. దాన్ని తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇప్పటి వరకు న్యాయ స్థానాల ద్వారా చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దాంతో మోడీ ప్రభుత్వం తన రూటును మార్చింది. న్యాయ స్థానాల ద్వారా ప్రయతించడం కన్నా, దౌత్య సంబంధాల ద్వారా ప్రయత్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకోసం ఆగష్టు 15న సుప్రీమ్ కోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Leave a Reply