ఫలించిన ఇద్దరు చంద్రుళ్ళ ప్రయత్నాలు..

ఇరు తెలుగు రాష్ట్రాల నేతలకు కేంద్రం శుభవార్తను అందించనున్నట్లు తెలుస్తుంది. రెండు సంవత్సరాలుగా ఇద్దరు ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లే కనబడుతుంది. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచాలని పార్లమెంట్ లో పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, చంద్రబాబు నాయుడులు అసెంబ్లీ స్థానాలను పెంచాలంటూ కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తీసుకు వచ్చారు. అదే సమయంలో సీట్లు పెరుగుతున్నాయంటూ ఇతర పార్టీల నేతలను అధికార పార్టీలోకి యదేచ్చగా చేర్చుకున్నారు. దాంతో కేంద్రం సీట్ల పెంపుకు ఒప్పుకుంటుందో లేదో అన్న సంశయం ఉండేది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే సీట్ల పెంపు తప్పకుండ జరిగే పరిస్థితులు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తెలంగాణలో కేసీఆర్ జిల్లాల విభజనను చేపట్టినట్లు తెలుస్తుంది. జిల్లాల విభజన వల్ల రాష్ట్రంలోని చాల నియోజకవర్గాలు అస్తవ్యస్తంగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన వల్ల వాటికి ఒక కొత్త రూపు తీసుకువచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply