రెండు ఒక్కటే..

పాకిస్థాన్ లోని బాలుచిస్థాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై పాక్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది అయితే బాలుచిస్థాన్ లోని ప్రజలు మాత్రం భారత ప్రధాని చేసిన ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ కు వెళ్ళడం నరకానికి వెళ్ళడం రెండు ఒకటేనని అయన పేర్కొన్నారు. భారత్ కు భారి నష్టం చేయాలన్న పాకిస్థాన్ పన్నాగం పారనందుకే కశ్మీర్ గురుంచి చిల్లర ఆరోపణలు చేస్తుందని ఆయన తెలిపారు. మరో వైపు పాకిస్థాన్ మాత్రం బాలుచిస్థాన్ పాకిస్థాన్ లో అంతర్భాగం అని, దాన్ని కశ్మీర్ తో ఏ మాత్రం పోల్చలేమని పేర్కొంది.

Leave a Reply