చంద్రబాబు, లోకేష్ లపై కేసు

తెలుగుదేశం పార్టీ ఇటివల మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ మహానాడులో చంద్రబాబు మెప్పుకోసం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు శ్రుతిమించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేసారు. అదే ఇప్పుడు వారికి చిక్కులు తెచ్చిపెట్టింది. తెలంగాణ సిఎం కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీశారంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డి దయాకర్ రెడ్డి లపై పిర్యాదు చేశారు.

Leave a Reply