కత్తిలాంటోడు మారిపోయాడు..

చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తన 150 చిత్రానికి ఇప్పటి వరకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ను అనుకున్నారు. [pullquote]ఈ చిత్రానికి తాజాగా ‘నెపోలియన్’ అనే టైటిల్ ను ఖారారు చేసినట్లు తెలుస్తుంది[/pullquote] విజయ్ తమిళ్ లో నటించిన కత్తి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. అయితే అన్ని బాగానే ఉన్నా చిరంజీవి అభిమానులకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ పై అసంతృప్తి నెలకొంది. ఈ విషయం చిరంజీవి దాకా వెళ్ళడంతో ఇప్పుడు టైటిల్ మార్చే పనిలో పడ్డట్లు సమాచారం. ఈ చిత్రానికి తాజాగా ‘నెపోలియన్’ అనే టైటిల్ ను ఖారారు చేసినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కింద చూడవచ్చు.

chiranjeevi 150th movie

Leave a Reply