పాల్గొననున్న బాలీవుడ్ స్టార్లు..

ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘కన్ఫ్లూయేన్స్‘ ఉత్సవాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటి నుండి ప్రతి యేడు ఆగష్టులో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, కళలు, సాహిత్యం, ప్రస్తుత భారతీయ సంస్కృతి, భారతీయ కళలతో ఆస్ట్రేలియా సంబంధాలపై చర్చలు, సెమినార్లు జరుగుతాయి. ఆస్ట్రేలియాలోని ఆరు ప్రధాన నగరాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. 10 వారల పాటు జరిగే ఈ ఉత్సవాల గురుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరికి వివరించే ఉద్దేశంతో వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కళాకారులతో పాటు, పలువురు బాలీవుడ్ స్టార్లు కుడా పాల్గొంటారు. ఈ సంవత్సరం భారతీయ కళాకారులతో కలిసి ఆస్ట్రేలియా కళాకారులు కూడా చిందేయనున్నారు.

Leave a Reply