దుమారం రేగుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్..

తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ తీవ్ర విమర్శల పాలవుతున్నది. ప్రతి పక్షాలు అధికార పక్షంపై పోరును కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భూ నిర్వాసితులకు మద్దతుగా నిరాహార దీక్షకు సిద్దపడితే ఆయనను ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం విడుదలైన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలన నడుస్తుందని విమర్శించారు. ఎలాగైనా 123 జీవోను అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అహింసా మార్గంలో దీక్షకు వెళ్తున్న తనను అణచి వేయాలని చూస్తున్నారని, అసలు కేసీఆర్ ది గాంధీ పాలన? లేక గాడ్సే పాలనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనను తెలంగాణ ద్రోహి అని ప్రచారం చేస్తున్నారని, తుమ్మల, కడియం, తలసాని, మహేందర్ రెడ్డి వంటి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవి ఎందుకిచ్చారని, ఆంధ్రా గుత్తేదార్లకు వత్తాసు పలుకుతున్న హరీష్ రావు కేటీఆర్లే తెలంగాణ ద్రోహులని జగ్గారెడ్డి విమర్శించారు.

Leave a Reply