కాంగ్రెస్ పార్టీకి ఇంటి దొంగలే ద్రోహం తలపెట్టారు…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎసార్సీపీలపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడానికి తెలుగుదేశం పార్టీ నేతలు పోరాటం చేయటం లేదని, తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు దద్దమ్మలు అని రఘువీరా రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ నేతృత్వంలోని వైఎసార్సీపీ ఐస్ క్రీం కరిగిపోయినట్లు కరిగి పోతుందని రఘువీరా రెడ్డి వ్యాఖానించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంటి దొంగలే ద్రోహం తలపెట్టారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి-తెలుగుదేశం పార్టీలు ద్రోహం చేస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో చట్టం అవసరం లేదని, గతంలో చాలా రాష్ట్రాలకు పార్లమెంట్ లో చట్టం చేయకుండా, కేవలం క్యాబినెట్ తీర్మానం ద్వారా ప్రత్యేక హోదా ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపి కేవీపీ రామచందర్ రావు ప్రవేశ పెట్టిన బిల్లుకు పార్లమెంట్ లో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని రఘువీరా కోరారు.

Leave a Reply