కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ..

తెలంగాణ కాంగ్రెస్ నేత, గద్వాల్ శాసనసభ్యురాలు డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారాయణపేట-కోడంగల్ ప్రాజెక్ట్ కోసం జలసాధన సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని, బాంచన్ దొర నీ కాల్మొక్తా అంటూ కాళ్ళ కాడ పడి  ఉంటారని కేసీఆర్ భావిస్తున్నారని, ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే కేసీఆర్ ను తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ నుండి గతంలో ఎంపీగా గెలిచినా కేసీఆర్ ఏం సాధించారని, జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న కేసీఆర్ కు అబద్దాల కోరు అవార్డు ఇవ్వొచ్చు అని డీకే అరుణ పేర్కొన్నారు. ప్రభుత్వం బలవంతంగా మల్లన్న సాగర్ కోసం భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని, భూ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Leave a Reply