ప్రజల అభిప్రాయాలను గౌరవించడం లేదు..!

జిల్లాల పునర్విభజన అంశం తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిచ్చు పెడుతుంది. ముఖ్యంగా జనగామ, గద్వాల్ తదితర ప్రాంతాల్లో జిల్లా కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. గద్వాల్ ను జిల్లా కేంద్రంగా చేసి జోగుళాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ గద్వాల్ ప్రజలు గద్వాల్ నుండి ఆలంపూర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మోసం చేసిన గాడ్సే కేసీఆర్ అని ఆమె విమర్శించారు. తమ కుటుంబ సభ్యులకు రాజకీయ ఉద్యోగాలు ఇప్పించేందుకే జిల్లాల పునర్విభజన చేస్తున్నారని, ప్రజల అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. గద్వాల్ కు జిల్లా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి అని ప్రజల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గౌరవించాలని ఆమె కోరారు.

Leave a Reply