చిరంజీవి కనీసం అక్కడైనా పరువు నిలుపుకుంటాడా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ప్రజా రాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటి చేశారు. కాని దారుణంగా ఓడిపోయారు. చివరికి ఆయన కూడా పోటి చేసిన ఒక స్థానంలో ఓడి పోయారు, మరొక స్థానంలో అతి కష్టం మీద గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్రంలో మంత్రి పదవిని పొందారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కావలసివచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథిగా చిరంజీవి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పొయింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసే కమిటీలో చిరంజీవికి కూడా స్థానం కల్పించింది. చిరంజీవి కనీసం తమిళనాడులోనైన కాంగ్రెస్ పరువు నిలబెదతాడేమో చూడాలి.

Leave a Reply