ముఖ్యమంత్రి పై మండిపడ్డ ప్రతిపక్ష నేత జానా రెడ్డి..

తెలంగాణ ప్రతిపక్ష నేత జానా రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలోవిమర్శలు చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను పరామర్శించేదుకు జానా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ నుండి బయలు దేరారు అయితే వీరిని మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానారెడ్డి భూ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుందని, కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా తమను ఆపే ప్రయత్నం చేసినా తాము మాత్రం ప్రజల తరపున పోరాటం చేయడం కొనసాగిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. తమను భయబ్రాంతులకు గురి చేసినా ప్రభుత్వానికి భయపడే ప్రసక్తి లేదని జానా రెడ్డి తెలిపారు.

Leave a Reply