తెరాస ప్రభుత్వంపై మండిపడ్డ వీహెచ్…

తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత వీ. హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ది ప్రచార ఆర్భాటమే తప్ప, పనులేం చేయడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే కొత్త జిల్లాల పేరుతో నాటకానికి తెర తీశారు అంటూ విమర్శించారు. జనాభా శాతం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. క్యాబినెట్ లో కేసీఆర్ మహిళలకు స్థానం ఇవ్వకపోవటంపై వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అంటే ఎంపీ కవిత మాత్రమేనని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

Leave a Reply