దేశంలో విధ్వంసకర కుట్రకు యత్నం

2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా, దేశంలో శాంతి భద్రతలు అస్థిర పరిచేందుకు 1993 ముంబై పేలుళ్ళ సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రయత్నించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకటించింది. గత నవంబర్ లో ఆరెస్సెస్ నాయకులు శిరీష్ బెంగాలి, ప్రగ్నీష్ మిస్త్రిలను చంపేసిన షుటర్లను విచారించిన అనంతరం అనేక దిగ్బ్రాంతికర విషయాలను బయటపెట్టింది.తాము దావూద్ మనుషులమని యాకూబ్  మెమన్ ఉరికి ప్రతీకారంగానే వారిని చంపినట్లు షూటర్లు అంగీకరించారు.వారిని మాత్రమే కాకుండా దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రణాళిక వేసినట్లు, అందులో భాగంగా అనేక మంది చర్చి ఫాదర్ లను, ఆరెస్సెస్ నేతలను, గుడిలను, చర్చిలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రణాళిక విఫలం కావడానికి కారణం మన దేశంలో ఇంటలిజెన్స్ విభాగం పటిష్టంగా ఉండడమే.

 

Leave a Reply