ఖచ్చితంగా అమలు చేయాల్సిందే..

అక్రమ వెబ్ సైట్ లపై న్యాయస్థానం కొరడా ఝలిపించింది. ఏకంగా 73 పైరసీ వెబ్ సైట్ లపై ఢిల్లీ హైకోర్టు వేటు వేసింది. ఇక విషయానికి వెళ్తే స్టార్ ఇండియా వెబ్ సైట్ లు అక్రమంగా తమ కంటెంట్ ను పైరసీ చేస్తున్నాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. అక్రమంగా ప్రసారాలు చేస్తున్న, అక్రమంగా కంటెంట్ ను పైరసీ చేస్తున్న 73 వెబ్ సైట్ లను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే వాటి వీడియోలకు సంబంధించిన యుఆర్ఎల్ లింక్ లను సైతం తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అయితే 2014లోనే ఆ అక్రమ వెబ్ సైట్ లను నిషేధించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు వెబ్ సైట్లు అక్రమంగా పైరసీ చేసిన కంటెంట్ ల యుఆర్ఎల్ తొలగించాయి. దీనితో సంతృప్తి చెందని కోర్టు మొత్తం వెబ్ సైట్ లనే నిషేధించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply