రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లుపై జరగనున్న చర్చ..

గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశాల్లో బిల్లు చర్చకు రాకుండానే సమావేశాలు ముగిసిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో మొదటి సారి చర్చకు వచ్చినప్పుడు ఆప్ ఎంపీ భగవంత్ మాన్ సింగ్ వ్యవహారం సభను కుదిపేయడంతో ప్రత్యేక హోదా బిల్లు పై చర్చ జరగలేదు. రెండో సారి చర్చకు వచ్చినప్పుడు ఇది ద్రవ్య బిల్లు మొదట లోక్ సభలోనే ప్రవేశ పెట్టాలని సభానాయకుడు అరుణ్ జైట్లీ చెప్పడంతో మరోసారి చర్చకు రాలేదు. అయితే బిల్లు చర్చకు రాకపోవడంతో ఆంధ్రులకు తమపై కోపం వచ్చింది అని గ్రహించిన బీజేపీ నేతలు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నేతృత్వంలో అన్ని పార్టీల ఫ్ల్లోర్ లీడర్ లతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చిన్చారు. దాంతో చర్చకు అంగీకరించిన అరుణ్ జైట్లీ, చర్చ తర్వాత బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. దానికి స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తిగా ఉంటే ఉపసంహరించమని కేవీపీని కోరతామని తెలిపారు.కానే కేవీపీ మాత్రం కాంగ్రెస్ తనని సస్పెండ్ చేసినా ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరిగేవరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసారు.తెలుగు దేశం పార్టీ కూడా బిల్లుపై చర్చ, ఓటింగ్ కోసం నోటిసు పంపింది.వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చర్చను ప్రారంభించే అవకాశం ఉంది.

Leave a Reply