తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయి..?

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినప్పటి నుండి రాష్ట్రంలో జిల్లాల ప్రకంపనలు మొదలు అయ్యాయి. అనేక పట్టణాల నుండి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ మొదలయ్యాయి. మొదట జూన్ 2నాటికే జిల్లాల ప్రకటన ఉంటుందని భావించిన అది సాధ్యపడలేదు. మొత్తం 24-25 జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికి, ఇప్పుడు మారిన పరిస్థుతుల దృశ్యా మరో 5-6 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తం 30 జిల్లాల వరకు ఉండబోతున్నాయి అని సమాచారం. కరీంనగర్ జిల్లాలో జగిత్యాలను మాత్రమే జిల్లా చేయాలనుకున్నప్పటికి ఇపుడు సిరిసిల్లను కూడా జిల్లా చేయాలని ఆదేశాలు జారి అయినట్లు సమాచారం. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూల్, వనపర్తిలను జిల్లా చేస్తున్నట్లు ప్రకటించినా, గద్వాల్,నారాయణ పేటలకు కుడా జిల్లా అయ్యే అన్ని అర్హతలు ఉండడంతో వాటిలో ఒకదాన్ని జిల్లా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి ఉండడంతో మరొక్కసారి భౌగోళిక పరిస్తుతులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి జిల్లాల ఏర్పాటును ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply