ప్రతిపక్ష నేతలు టెర్రరిస్టులా….?

మల్లన్న సాగర్ కు ప్రతిపక్ష నేతలను వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం పై కాంగ్రెస్ నేత, డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ చూడడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు జానా రెడ్డి, షబ్బీర్ అలీలను అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. ప్రతిపక్షాలు గనుక మల్లన్న సాగర్ కు వెళ్తే అసలు నిజాలు బయట పడతాయనే భయంతోనే కేసీఆర్ అరెస్ట్ చేయించారని ఆమె విమర్శించారు.మల్లన్న సాగర్  ఏమైనా పాకిస్తాన్ లో ఉందా లేకపోతే ప్రతిపక్ష నేతలేమైనా టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి అంగీకరించారని హరీష్ రావు చెబుతున్నారని అది పచ్చి అబద్దం అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పొలిసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని, మల్లన్న సాగర్ రైతుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందని డీకే అరుణ అన్నారు. ఎంసెట్ – 2 పేపర్ లీకేజ్ పై ముఖ్యమంత్రి స్పందించాలని, లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Leave a Reply