తెలంగాణలో జిల్లాల పెంపు లాభమా? లేక నష్టమా?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 14-15 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అలాగే 40 వరకు కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల వాళ్ళ అనేక లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అధికార వికేంద్రికరణ దాంతో పాటు రాష్ట్రంలో పట్టణ శాతం కూడా పెరుగుతుంది. ఒక పట్టణం జిల్లాగా మారడం వల్ల ఆ పట్టణంలో రియల్ ఎస్టేట్ గణనీయంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే అనేక పరిశ్రమలు కొత్తగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది, మొత్తంగా ఆ పట్టణ ప్రజల జీవన స్థాయీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో జిల్లా కేంద్రాలు చాల వరకు ఆ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు చాల దూరంగా ఉన్నాయి. దీని వల్ల ఆ జిల్లా ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే అనేక ఆపసోపాలు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాలోని ప్రాంతాలకు చేరువగా ఉండేలా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. జిల్లాలతో పాటు మండలాలను,రెవిన్యూ డివిజన్లు కూడా పెంచాలనుకోవడం మరొక శుభ పరిణామం. ఎందుకంటే ప్రతి మండలానికి ఒక పోలీసు స్టేషన్ వస్తుంది దానివల్ల శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. అలాగే తహసిల్దార్ ఆఫీసులు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులతో ఆ పెరిగే స్థానాల్ని భర్తీ చేయవచ్చు.

జిల్లాల పెంపు వల్ల రాష్ట్రానికి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను కూడా కేంద్రం పెంచవలసి వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించారో లేదో తెలుపలేదు. ఒకవేళ కేంద్ర సహకారం లేకుండా ఏక పక్షంగా జిల్లాల పెంపు చేపడితే అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్రం నుండి వచ్చే అనేక పథకాలకు కేంద్రం జిల్లాను యూనిట్గా తీసుకుంటుంది.

జిల్లాలను పెంచడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులు నష్టపోవచ్చు, మరి కొంతమంది లాభ పడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నాయకులు వారి జిల్లాలో తిరుగులేని నేతలుగా చలామణి అవుతున్నారు, జిల్లాల పెంపు వల్ల వారి అధికారం కుదించుకు పోవచ్చు. అదే సమయంలో కొత్త జిల్లలో కొంతమంది నాయకులు ఎదిగే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా జిల్లాల పెంపు అనేది తెలంగాణకు మేలు చేస్తుంది అనడంలో సందేహం లేదు.

Leave a Reply