సంచలన వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్..

అమెరికా అధ్యక్షుడిగా పోటి చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తరచుగా అడ్డు అదుపు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఆగడాలు మధ్య ప్రాచ్యం దేశాల నుండి అమెరికా వరకు విస్తరించాయని, అందుకు కారణం ఒబామాయేనని ఆరోపించారు. అసలు ఐసిస్ ను స్థాపించింది ఒబామాయేనని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై కూడా ఆరోపణలు చేశారు. హిల్లారీ క్లింటన్ ను ఐసిస్ సహ వ్యవస్థాపకురాలిగా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఆరోపణలపై స్పందించేందుకు వైట్ హౌస్ వర్గాలు నిరాకరించాయి.

Leave a Reply