రోడ్డున పడ్డ నాలుగు వేల మంది ఉద్యోగులు

ఈ కామర్స్ వెబ్ సైట్  ‘ఆస్క్ మీ డాట్ కాం’ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది.ఈ నిర్ణయంతో దాదాపు నాలుగువేలమంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు.ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ నష్టాల్లో నడపటం,నిధులు లేకపోవడమే అని అందుకే సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిపెస్తున్నామని అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది  జీ బిజ్.సంస్థ అభివృద్ధికై  నిధుల సమీకరణ చేయడంలో తాము చేసిన ప్రయత్నాలు సరిగా సఫలం కాలేదని అప్పటికి సంస్థ నష్టాల్లోనే నడుపుతూ వచ్చామని సంస్థ ఒక నివేదిక ద్వారా తెలిపింది.ఆస్క్ మీ  సంస్థలో అతి పెద్ద షేర్ హోల్డర్ ఆస్ట్రో హోల్డింగ్స్ గత నెల నిష్క్రమించడమే ఈ పరిస్థితికి కారణంగా పేర్కొంది.అయితే మూకుమ్మడిగా పెరుగుతున్న ఈ కామర్సు సంస్థలు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని విశ్లేషకులు చెప్తున్నారు.

Leave a Reply