రహస్యంగా మాట్లాడాలనుకునే వారికి గుడ్ న్యూస్

మనం మాట్లాడే మాటలు ఎవరికీ చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. అందులో రహస్యాలు ఉంటాయి. అయితే సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లలో ఒకరి మెసేజెస్ మరొకరు చూసే ఆస్కారం చాలా ఎక్కువ. అయితే ఇకపై ఫేస్ బుక్ లో ఒకరి మెసేజెస్ మరొకరు చదవకుండా ఉండేందుకు వీలుగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా మన సమాచారాన్ని భద్రపరించేందుకు ఫేస్ బుక్ సిద్ధమైంది. ఇప్పటికే వాట్సప్ ఈ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఎవరి మెసేజెస్ వాళ్ళు మాత్రమే చూసేందుకు వీలుగా ఒక రక్షణ వ్యవస్థ ను అందించేందుకు ఫేస్ బుక్ ప్రయత్నం మొదలుపెట్టిందని ముందుగా కొద్ది మందికి ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చి నెమ్మదిగా అందరికి ఈ ఫీచర్ ను అందించేందుకు ఫేస్ బుక్ కృషిచేస్తుందని సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ అనధికారికంగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

Leave a Reply