ఫేస్ బుక్ కు200 మిలియన్ డాలర్ల నష్టం..

ఆసియాతో పటు మధ్య యురోప్  దేశాలకు ఇంటర్నెట్ అందించాలని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు చెందిన ఎఫ్ బీ టెక్ 30 ఉపగ్రహాన్ని 12 నెలల పాటు రూపొందించారు. దానిని స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఫేస్ బుక్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు. కేప్ కేనరవాల్ లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించేందుకు సిద్దం అయ్యారు. ఇదే లాంచ్ ప్యాడ్ నుండి గత ఆరేళ్లలో 26 రాకెట్లలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్  కు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించారు. అయితే స్పేస్ ఎక్స్ రాకెట్ ను ప్రయోగించేందుకు సిద్దం అవుతున్న సమయంలో లాంచ్ ప్యాడ్ లోని 40 కాంప్లెక్స్ లో ప్రమాదం సంభవించింది. దాంతో రాకట్ తో పాటు అందులో ఉన్న ఉపగ్రహం కూడా అగ్నికి ఆహుతైంది. రాకెట్ లోకి ఇందనం నింపేటప్పుడు ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీనిపై స్పందించిన జుకర్ బర్గ్ తాను తీవ్ర నిరాశకు లోనయినట్లు తెలిపారు. ప్రమాదం వల్ల 200 మిలియన్ డాలర్ల నష్టం సంభందించినట్లు తెలిపారు.

 

Leave a Reply