నేటి నుంచి ప్రారంభం కానున్న FTAPCCI శతాబ్ధి వేడుకలు

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్  చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTAPCCI ) శతాబ్ది వేడుకలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. 1917 నుండి కామర్స్, ఇండస్ట్రీ రంగాల్లో విశేష సేవలనందిస్తూ ముందుకు వెళ్తున్న FTAPCCI మొదలై నూరేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.ఈ వేడుకలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు.ఈ వేడుకలు హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ , FAPCCI మార్గ్ లోని ఫెడరేషన్ హౌస్ లో జరగనున్నాయి. ఈ వేడుకలలో రెండు తెలుగు రాష్ట్రాలలోని FTAPCCI సభ్యులంతా  పాల్గొననున్నారు.

Leave a Reply