పుష్కరాలకు నీటి విడుదల

ఈ నెల 12 నుంచి కృష్ణ పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని ఘాట్లలో నీరు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావును ఆదేశించారు. శ్రీశైలం డ్యామ్ లో నీటి మట్టం 112 టీఎంసీలకు చేరుకుందని, 15-16 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని ముఖ్యమంత్రి  వెల్లడించారు. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తుల పుణ్య స్నానాలకు సరిపోయే విధంగా నీటి విడుదల చేయాలని సిఎం ఆదేశించారు. మహబూబ్ నగర్, నల్గొండ కలెక్టర్లతో చర్చించి, ఎంత నీరు అవసరమవుతుందనే విషయంలో ఈ సాయంత్రంలోగా ప్రతిపాదనలు పంపాలని హరీష్ రావును సిఎం ఆదేశించారు. ప్రతిపాదనలు వచ్చిన వెంటనే నీటి విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని సిఎం చెప్పారు.

Leave a Reply